కురాన్ - 27:4 సూరా సూరా నమల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ زَيَّنَّا لَهُمۡ أَعۡمَٰلَهُمۡ فَهُمۡ يَعۡمَهُونَ

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధుల వలే దారి తప్పి తిరుగుతూ ఉంటారు[1].

సూరా సూరా నమల్ ఆయత 4 తఫ్సీర్


[1] పరలోక జీవితాన్ని నమ్మని వారు తమ భౌతిక మరియు ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత నిస్తారు. కాబట్టి వారికి వారి దుష్ట చేష్టలు ఆకర్షణీయమైనవిగా కనిపిస్తాయి. దానివల్ల వారు మరింత మార్గభ్రష్టత్వంలో పడిపోతారు. జిన్నాతులకు మరియు మానవులకు, సత్యాసత్యాలనూ, మంచిచెడులనూ గుర్తించే విచక్షణా శక్తి ఇవ్వబడింది కాబట్టి వారు తమ కర్మలకు తామే బాధ్యులవుతారు. అల్లాహ్ (సు.తా.) తనను తాను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించేవానికే సన్మార్గం చూపుతాడు. మరియు బుద్ధిపూర్వకంగా దుర్మార్గాన్ని అవలంభించేవాడిని, వాడి దుర్మార్గంలో వదలుతాడు. చూడండి, 2:7.

సూరా నమల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter