కురాన్ - 4:1 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి).[1] నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని[2] ఉన్నాడు.

సూరా సూరా నిసా ఆయత 1 తఫ్సీర్


[1] అల్ - అర్'హాము, ర'హిమున్ యొక్క బహువచనం: అంటే గర్భకోశం. దాని నుండియే బంధుత్వాలు ఏర్పడుతాయి. కాబట్టి: "బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి) మరియు వారి (బంధువుల) హక్కులను చెల్లించండి." అని ఎన్నో హదీసులు ఉన్నాయి. [2] రఖీబున్ (అర్-రఖీబు) : చూడండి, 5:117. The Watcher, Observer, Guardian, Keeper from whom nothing is hidden. పరిశీలకుడు, కనిపెట్కొని ఉండేవాడు. గమనించేవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

Sign up for Newsletter