కురాన్ - 4:102 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذَا كُنتَ فِيهِمۡ فَأَقَمۡتَ لَهُمُ ٱلصَّلَوٰةَ فَلۡتَقُمۡ طَآئِفَةٞ مِّنۡهُم مَّعَكَ وَلۡيَأۡخُذُوٓاْ أَسۡلِحَتَهُمۡۖ فَإِذَا سَجَدُواْ فَلۡيَكُونُواْ مِن وَرَآئِكُمۡ وَلۡتَأۡتِ طَآئِفَةٌ أُخۡرَىٰ لَمۡ يُصَلُّواْ فَلۡيُصَلُّواْ مَعَكَ وَلۡيَأۡخُذُواْ حِذۡرَهُمۡ وَأَسۡلِحَتَهُمۡۗ وَدَّ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡ تَغۡفُلُونَ عَنۡ أَسۡلِحَتِكُمۡ وَأَمۡتِعَتِكُمۡ فَيَمِيلُونَ عَلَيۡكُم مَّيۡلَةٗ وَٰحِدَةٗۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ إِن كَانَ بِكُمۡ أَذٗى مِّن مَّطَرٍ أَوۡ كُنتُم مَّرۡضَىٰٓ أَن تَضَعُوٓاْ أَسۡلِحَتَكُمۡۖ وَخُذُواْ حِذۡرَكُمۡۗ إِنَّ ٱللَّهَ أَعَدَّ لِلۡكَٰفِرِينَ عَذَابٗا مُّهِينٗا

మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.[1]

సూరా సూరా నిసా ఆయత 102 తఫ్సీర్


[1] చూడండి, 2:239.

Sign up for Newsletter