మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా - మీరు బాధపడుతున్నట్లే - బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.