కురాన్ - 4:140 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَدۡ نَزَّلَ عَلَيۡكُمۡ فِي ٱلۡكِتَٰبِ أَنۡ إِذَا سَمِعۡتُمۡ ءَايَٰتِ ٱللَّهِ يُكۡفَرُ بِهَا وَيُسۡتَهۡزَأُ بِهَا فَلَا تَقۡعُدُواْ مَعَهُمۡ حَتَّىٰ يَخُوضُواْ فِي حَدِيثٍ غَيۡرِهِۦٓ إِنَّكُمۡ إِذٗا مِّثۡلُهُمۡۗ إِنَّ ٱللَّهَ جَامِعُ ٱلۡمُنَٰفِقِينَ وَٱلۡكَٰفِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا

మరియు వాస్తవానికి, (అల్లాహ్) మీ కొరకు ఈ గ్రంథంలో (ఈ విధమైన ఆజ్ఞ) అవతరింపజేశాడు: "ఒకవేళ మీరు అల్లాహ్ సూక్తులను గురించి తిరస్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే! అలా చేసేవారు, (ఆ సంభాషణ వదలి) ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి!" అలా చేస్తే నిశ్చయంగా, మీరు కూడా వారిలాంటి వారే! నిశ్చయంగా, అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు.

Sign up for Newsletter