కురాన్ - 4:157 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَوۡلِهِمۡ إِنَّا قَتَلۡنَا ٱلۡمَسِيحَ عِيسَى ٱبۡنَ مَرۡيَمَ رَسُولَ ٱللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمۡۚ وَإِنَّ ٱلَّذِينَ ٱخۡتَلَفُواْ فِيهِ لَفِي شَكّٖ مِّنۡهُۚ مَا لَهُم بِهِۦ مِنۡ عِلۡمٍ إِلَّا ٱتِّبَاعَ ٱلظَّنِّۚ وَمَا قَتَلُوهُ يَقِينَۢا

మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము." అని అన్నందుకు.[1] మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు.[2] నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.

సూరా సూరా నిసా ఆయత 157 తఫ్సీర్


[1] చూడండి, 3:55. [2] అంటే 'ఈసా మసీ'హ్ (ఏసుక్రీస్తు) వలే కనిపించిన మరొక వ్యక్తిని సిలువపై ఎక్కించారు. (నోబుల్ ఖుర్ఆన్).

Sign up for Newsletter