కురాన్ - 4:171 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لَا تَغۡلُواْ فِي دِينِكُمۡ وَلَا تَقُولُواْ عَلَى ٱللَّهِ إِلَّا ٱلۡحَقَّۚ إِنَّمَا ٱلۡمَسِيحُ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ رَسُولُ ٱللَّهِ وَكَلِمَتُهُۥٓ أَلۡقَىٰهَآ إِلَىٰ مَرۡيَمَ وَرُوحٞ مِّنۡهُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦۖ وَلَا تَقُولُواْ ثَلَٰثَةٌۚ ٱنتَهُواْ خَيۡرٗا لَّكُمۡۚ إِنَّمَا ٱللَّهُ إِلَٰهٞ وَٰحِدٞۖ سُبۡحَٰنَهُۥٓ أَن يَكُونَ لَهُۥ وَلَدٞۘ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلٗا

ఓ గ్రంథప్రజలారా! మీరు మీ ధర్మ విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి.[1] మరియు అల్లాహ్ ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ)[2] మరియు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూహ్). కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు (ఆరాధ్య దైవాలు): "ముగ్గురు!" అని అనకండి.[3] అది మానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు.

సూరా సూరా నిసా ఆయత 171 తఫ్సీర్


[1] 'గులువ్వున్: అంటే అతిగా ప్రవర్తించటం. అంటే ఇక్కడ క్రైస్తవులు 'ఈసా ('అ.స.)కు మరియు అతని తల్లికి అంట గట్టిన స్థానం. వారు ఆ ఇద్దరికి దైవత్వపు స్థానం అంట గట్టి వారిని ఆరాధించసాగారు. చూడండి, 9:31. [2] కలిమతుల్లాహ్: అల్లాహ్ (సు.తా.) యొక్క మాట, పదం, సంకేతం, ఉత్తరువు లేక ఆజ్ఞ. అంటే అల్లాహుతా'ఆలా ఏదైనా చేయదలుచుకుంటే దానిని : "అయిపో" (కున్)! అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అది అయిపోతుంది (ఫ యకూన్). చూడండి, 3:45. [3] క్రైస్తవులలో కొందరు 'ఈసా ('అ.స.) స్వయంగా దేవుడే అంటారు. మరికొందరు అతనిని దేవుని కుమారుడు అని అంటారు. ఇంకా కొందరు ముగ్గురు దైవాలున్నారంటారు. ఆ ముగ్గురు అల్లాహ్ (సు.తా.), జిబ్రీల్ మరియు 'ఈసా ('అలైహిమ్ స.) అని అంటారు. ఇది మానుకనండని అల్లాహుతా'ఆలా ఆజ్ఞాపిస్తున్నాడు.

Sign up for Newsletter