కురాన్ - 4:69 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَن يُطِعِ ٱللَّهَ وَٱلرَّسُولَ فَأُوْلَـٰٓئِكَ مَعَ ٱلَّذِينَ أَنۡعَمَ ٱللَّهُ عَلَيۡهِم مِّنَ ٱلنَّبِيِّـۧنَ وَٱلصِّدِّيقِينَ وَٱلشُّهَدَآءِ وَٱلصَّـٰلِحِينَۚ وَحَسُنَ أُوْلَـٰٓئِكَ رَفِيقٗا

మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది![1]

సూరా సూరా నిసా ఆయత 69 తఫ్సీర్


[1] మానవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారితో బాటు ఉంటాడు. ('స. బు'ఖారీ, కితాబుల్ ఆదాబ్, బాబ్ 97, ముస్లిం 'హదీస్' నెం. 1640). మరొక 'హదీస్'లో ఇలా ఉంది : "అత్యధికంగా నఫిల్ నమా'జ్ లు చేయటం వల్ల స్వర్గంలో దైవప్రవక్త ('స'అస) సాంగత్యం లభిస్తుంది." ('స. ముస్లిం కితాబ్ అ'స్సలాహ్, బాబ్ ఫ'ద్ల్ అస్సుజూద్, 'హదీస్' నం. 488).

Sign up for Newsletter