పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగం ఉంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగం ఉంది; [1] అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్) విధిగా నియమించిన భాగం.
సూరా సూరా నిసా ఆయత 7 తఫ్సీర్
[1] ముందు వస్తుంది. స్త్రీలకు, పురుషులకు దొరికే భాగంలో సగం ఆస్తి దొరుకుతుందని. దీనికి కారణం స్త్రీలపై ఎవ్వరినీ పెంచే బాధ్యత లేదు. ఆమె పోషణ, రక్షణ బాధ్యత, ఆమె తండ్రి, భర్త, సోదరుని లేక కుమారునిపై ఉంది. చివరకు వీరంతా ఎవ్వరూ లేనపుడు ఇస్లామీయ ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఖుర్ఆన్ చేసిన ఈ పంపకంలో స్త్రీలకు ఎలాంటి అన్యాయం జరుగలేదు. మరొక విషయమేమిటంటే, దగ్గరి బంధువులు అంటే ప్రథమ శ్రేణికి చెందిన బంధువులు. 1. సంతానం, 2. తల్లిదండ్రులు 3. భర్త లేక భార్యలు.
సూరా సూరా నిసా ఆయత 7 తఫ్సీర్