కురాన్ - 4:93 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَن يَقۡتُلۡ مُؤۡمِنٗا مُّتَعَمِّدٗا فَجَزَآؤُهُۥ جَهَنَّمُ خَٰلِدٗا فِيهَا وَغَضِبَ ٱللَّهُ عَلَيۡهِ وَلَعَنَهُۥ وَأَعَدَّ لَهُۥ عَذَابًا عَظِيمٗا

మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు [1] మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్) అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు.

సూరా సూరా నిసా ఆయత 93 తఫ్సీర్


[1] హత్య మూడు రకాలు: 1) ఖత్లె - 'అమద్: అంటే బుద్ధిపూర్వకంగా హత్య చేయడం. దాని శిక్ష ఇక్కడ చెప్పబడింది. ఇహలోకంలో మరణశాసనం, మరియు పరలోకంలో నరకం. 2) ఖత్లె - 'ఖ'తా: పొరపాటు వ్ల, అనుకోని విధంగా జరిగిన హత్య. దీని విషయం ఇంతకు ముందు 92 ఆయత్ లో వచ్చింది. 3) ఖత్లె - షుబ్హ్ 'అమద్: దీని వివరాలు 'హదీస్' లలో పేర్కొనబడ్డియి.

Sign up for Newsletter