కురాన్ - 24:41 సూరా సూరా నూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يُسَبِّحُ لَهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱلطَّيۡرُ صَـٰٓفَّـٰتٖۖ كُلّٞ قَدۡ عَلِمَ صَلَاتَهُۥ وَتَسۡبِيحَهُۥۗ وَٱللَّهُ عَلِيمُۢ بِمَا يَفۡعَلُونَ

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు[1]. మరియు అవి చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు[2].

సూరా సూరా నూర్ ఆయత 41 తఫ్సీర్


[1] అంటే ప్రతి దానికి అల్లాహ్ (సు.తా.) యొక్క స్తోత్రం (ప్రార్థన) ఏ విధంగా చేయాలో తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయడమనేది కూడా అల్లాహ్ (సు.తా.) ఘనతలలో ఒకటి. ఏ విధంగానైతే వాటిని సృష్టించడం కూడా కేవలం ఆయన (సు.తా.) ఘనతలలో ఒకటో! చూడండి, 17:44. [2] విచక్షణాశక్తి లేని ప్రతివస్తువు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేస్తుంది. అలాంటప్పుడు ఈ విచక్షణాశక్తి గల జిన్నాతులు మరియు మానవులు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయకుంటే వారు ఆయన శిక్షకు అర్హులు కాగూడదా ?

సూరా నూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter