Quran Quote  :  Whoever intends to perform Pilgrimage in these months shall abstain from sensual indulgence, wicked conduct and quarreling - 2:197

కురాన్ - 13:4 సూరా సూరా రద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَفِي ٱلۡأَرۡضِ قِطَعٞ مُّتَجَٰوِرَٰتٞ وَجَنَّـٰتٞ مِّنۡ أَعۡنَٰبٖ وَزَرۡعٞ وَنَخِيلٞ صِنۡوَانٞ وَغَيۡرُ صِنۡوَانٖ يُسۡقَىٰ بِمَآءٖ وَٰحِدٖ وَنُفَضِّلُ بَعۡضَهَا عَلَىٰ بَعۡضٖ فِي ٱلۡأُكُلِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ

మరియు భూమిలో వేర్వేరు రకాల (నేలలు) ఒకదాని కొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి మరియు ద్రాక్షతోటలు, పంటపొలాలు మరియు ఖర్జూరపు చెట్లు, కొన్ని ఒక్కొక్కటి గానూ, మరికొన్ని గుచ్చలు - గుచ్చలు (జతలు) గానూ ఉన్నాయి.[1] వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కాని తినటానికి వాటి రుచులు, ఒకటి మరొకదాని కంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా వీటన్నింటిలో అర్థం చేసుకో గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి.[2]

సూరా సూరా రద్ ఆయత 4 తఫ్సీర్


[1] కొన్ని చెట్లు ఒకే కాండం గలవి. మరికొన్ని శాఖలు గలవి ఉన్నాయి. [2] చూడండి, 6:99 మరియు 141.

సూరా రద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter