కురాన్ - 37:142 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَٱلۡتَقَمَهُ ٱلۡحُوتُ وَهُوَ مُلِيمٞ

ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 142 తఫ్సీర్


[1] యూనుస్ ('అ.స.) ఇరాఖ్ ప్రాంతంలో నైనవా (ఇప్పటి మో'సల్) నగరానికి ప్రవక్తగా పంపబడ్డారు. అక్కడి రాజు ఒక లక్ష బనీ ఇస్రాయీల్ సంతతి వారిని బందీలుగా చేసుకున్నాడు. వారి మార్గదర్శకత్వానికి అల్లాహ్ (సు.తా.) యూనుస్ ('అ.స.) ను పంపాడు. కాని వారు అతనిని విశ్వసించలేదు. అతను వారిని అల్లాహ్ (సు.తా.) శిక్ష రానున్నదనీ భయపెట్టారు. ఆ శిక్ష రాకముందే అల్లాహ్ (సు.తా.) అనుమతి లేకుండానే అతను అక్కడి నుండి పారిపోయి నావ ఎక్కారు. నావ బరువుతో మునిగి పోతుండగా, అక్కడ చీటీలు వేశారు. దానిలో అతని పేరు రాగా అతను సముద్రంలోకి దూకారు. అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది. చేప కడుపులో అతను అల్లాహ్ (సు.తా.) ను వేడుకున్నారు. అప్పుడతను బయట వేయబడ్డారు. ఇంకా చూడండి, 68:48.

Sign up for Newsletter