కురాన్ - 42:52 సూరా సూరా షూరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَكَذَٰلِكَ أَوۡحَيۡنَآ إِلَيۡكَ رُوحٗا مِّنۡ أَمۡرِنَاۚ مَا كُنتَ تَدۡرِي مَا ٱلۡكِتَٰبُ وَلَا ٱلۡإِيمَٰنُ وَلَٰكِن جَعَلۡنَٰهُ نُورٗا نَّهۡدِي بِهِۦ مَن نَّشَآءُ مِنۡ عِبَادِنَاۚ وَإِنَّكَ لَتَهۡدِيٓ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. [1] (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. [2] మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు.

సూరా సూరా షూరా ఆయత 52 తఫ్సీర్


[1] రూ'హున్: ఇక్కడ దివ్యజ్ఞానం (ఖుర్ఆన్) అనే అర్థమిస్తోంది. ఎందుకంటే ఖుర్ఆన్ వల్ల హృదయాలకు 'జీవం' లభిస్తుంది. ఏ విధంగానైతే రూ'హ్ తో మానవునికి జీవం లభిస్తుందో! చూడండి, 16:2, 40:15. [2] చూడండి, 41:44.

సూరా షూరా అన్ని ఆయతలు

Sign up for Newsletter