కురాన్ - 64:9 సూరా సూరా తగాబూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَوۡمَ يَجۡمَعُكُمۡ لِيَوۡمِ ٱلۡجَمۡعِۖ ذَٰلِكَ يَوۡمُ ٱلتَّغَابُنِۗ وَمَن يُؤۡمِنۢ بِٱللَّهِ وَيَعۡمَلۡ صَٰلِحٗا يُكَفِّرۡ عَنۡهُ سَيِّـَٔاتِهِۦ وَيُدۡخِلۡهُ جَنَّـٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ

(జ్ఞాపకముంచుకోండి) సమావేశపు రోజున ఆయన మీ అందరిని సమావేశపరుస్తాడు[1]. అదే లాభనష్టాల దినం. మరియు ఎవడైతే అల్లాహ్ ను విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వాని పాపాలను ఆయన తొలగిస్తాడు. మరియు అతనిని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు, వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అదే గొప్ప విజయం.

సూరా సూరా తగాబూన్ ఆయత 9 తఫ్సీర్


[1] చూడండి, 11:103 మరియు 56:49-50 పునరుత్థాన దినం, సమావేశదినం ఎందుకు అనబడిందంటే - ఆ రోజు యుగయుగాల ప్రజలందరు ఒకేసారి బ్రతికించి లేపబడతారు. మరియు ఒకేచోట సమావేశపరచబడతారు. అది ఒక పెద్ద మైదానం. ప్రతి ఒక్కడు ఎంతో దూరం వరకు చూడగల్గుతాడు.

సూరా తగాబూన్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18

Sign up for Newsletter