కురాన్ - 9:23 సూరా సూరా తౌబా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُوٓاْ ءَابَآءَكُمۡ وَإِخۡوَٰنَكُمۡ أَوۡلِيَآءَ إِنِ ٱسۡتَحَبُّواْ ٱلۡكُفۡرَ عَلَى ٱلۡإِيمَٰنِۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمۡ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلظَّـٰلِمُونَ,

ఓ విశ్వాసులారా! మీ తండ్రితాతలు మరియు మీ సోదరులు సత్యతిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునే వారే) దుర్మార్గులు.[1]

సూరా సూరా తౌబా ఆయత 23 తఫ్సీర్


[1] హిజ్ రత్ నుండి జిహాద్ విషయంలో మీరు, మీ సోదరుల మరియు తండ్రుల ప్రేమను రానివ్వకండి. వారు మీ స్నేహితులు కాలేరు. వారు మీతో మంచిగా వ్యవహరిస్తే, మిమ్మల్ని మీ ఇస్లాం ధర్మాన్ని పాటించటం నుండి ఆపకుంటే, వారితో మంచిగా వ్యవహరించండి. కాని వారు మిమ్మల్ని ఇస్లాం కొరకే బాధిస్తే, వారిని మీ స్నేహితులుగా భావించకండి. (చూ. 3:28, 60:89).

సూరా తౌబా అన్ని ఆయతలు

Sign up for Newsletter