కురాన్ - 9:30 సూరా సూరా తౌబా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَالَتِ ٱلۡيَهُودُ عُزَيۡرٌ ٱبۡنُ ٱللَّهِ وَقَالَتِ ٱلنَّصَٰرَى ٱلۡمَسِيحُ ٱبۡنُ ٱللَّهِۖ ذَٰلِكَ قَوۡلُهُم بِأَفۡوَٰهِهِمۡۖ يُضَٰهِـُٔونَ قَوۡلَ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَبۡلُۚ قَٰتَلَهُمُ ٱللَّهُۖ أَنَّىٰ يُؤۡفَكُونَ,

మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు.[1] మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)!

సూరా సూరా తౌబా ఆయత 30 తఫ్సీర్


[1] బాబిలోనియన్ లు (Babylonians) యూదులను, వెడలగొట్టిన తరువాత వారు (యూదులు) తౌరాత్ ను కోల్పోయారు. అది ఈ రోజు న్న స్థితిలోకి, దానిని తిరిగి తెచ్చినవారు 'ఉ'జైర్ 'అ.స. (Ezra). అతనే ఈ రోజు ఆచారంలో ఉన్న యూదమతాన్ని స్థాపించారు. (Encyclopedia Brittanica, 1963, vol-9, p.15). అతనినే యూదులు అల్లాహుతా'ఆలా కుమారుడంటారు.

సూరా తౌబా అన్ని ఆయతలు

Sign up for Newsletter