కురాన్ - 43:48 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا نُرِيهِم مِّنۡ ءَايَةٍ إِلَّا هِيَ أَكۡبَرُ مِنۡ أُخۡتِهَاۖ وَأَخَذۡنَٰهُم بِٱلۡعَذَابِ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ

మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది.[1] మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని![2]

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 48 తఫ్సీర్


[1] అద్భుత సూచనల కోసం చూడండి, 7:133-135. [2] అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలటం మానవుడు అల్లాహ్ (సు.తా.) ఉనికిని గ్రహించే స్వాభావిక లక్షణం. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) నుండి మరలిపోవటం అతని మానసిక పతనం, ఆధ్యాత్మిక భ్రష్టత్వం. చూడండి, 7:172-173.

సూరా జుఖ్రఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter