Quran Quote  :  Non-Believers spend their wealth to hinder people from the way of Allah. - 8:36

కురాన్ - 39:10 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡ يَٰعِبَادِ ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ رَبَّكُمۡۚ لِلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٞۗ وَأَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٌۗ إِنَّمَا يُوَفَّى ٱلصَّـٰبِرُونَ أَجۡرَهُم بِغَيۡرِ حِسَابٖ

(ఓ ముహమ్మద్!) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని) అను: "ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురుషులై ఉంటారో (వారికి పరలోకంలో) మేలు జరుగుతుంది. మరియు అల్లాహ్ భూమి చాలా విశాలమైనది. [1] నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది."

సూరా సూరా జుమర్ ఆయత 10 తఫ్సీర్


[1] పాపం మరియు సత్యతిరస్కారం నుండి - పుణ్యం, సత్యం మరియు అల్లాహ్ (సు.తా.) వైపునకు - మరలే అవకాశం ఎల్లప్పుడూ ఉంది. ఇదే వాస్తవమైన 'హిజ్రత్' వలసపోవటం. ఇంకా చూడండి, 4:97. ఒక వ్యక్తికి తన నివాసస్థలంలో ఉంటూ ఈమాన్ పై ఉండటం దుర్భరమైతే! అతడు ఇతర చోట్లకు హిజ్రత్ చేసి తన ధర్మాన్ని కాపాడుకోవాలి.

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter