కురాన్ - 39:23 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱللَّهُ نَزَّلَ أَحۡسَنَ ٱلۡحَدِيثِ كِتَٰبٗا مُّتَشَٰبِهٗا مَّثَانِيَ تَقۡشَعِرُّ مِنۡهُ جُلُودُ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُمۡ ثُمَّ تَلِينُ جُلُودُهُمۡ وَقُلُوبُهُمۡ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِۚ ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهۡدِي بِهِۦ مَن يَشَآءُۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٍ

అల్లాహ్ సర్వశ్రేష్ఠమైన బోధనలను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). [1] తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన మెత్తబడతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలుతాడో, అతనికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు. [2]

సూరా సూరా జుమర్ ఆయత 23 తఫ్సీర్


[1] చూడండి, 4:82 మరియు 25:32. [2] చూడండి, 14:4

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter