Quran Quote  :  If We ever favor man with Our Mercy, and then take it away from him, he becomes utterly desperate, totally ungrateful. - 11:9

కురాన్ - 39:3 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ

వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" [1] నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. [2] నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.[3]

సూరా సూరా జుమర్ ఆయత 3 తఫ్సీర్


[1] సిఫారస్: అల్లాహ్ (సు.తా.) దగ్గర ఎవరి సిఫారసూ చెల్లదు. ఆయన అనుమతించిన వారి సిఫారస్ తప్ప! వారు దైవదూతలు గానీ ప్రవక్తలు గానీ లేక సద్పురుషులు కావచ్చు. కాని ముఖ్య విషయమేమిటంటే, అల్లాహ్ (సు.తా.), తనకు తప్ప ఇతరులకు ఆరాధన / దాస్యం , చేయటాన్ని ఎన్నటికీ క్షమించడు. దైవత్వంలో ఆయనకు భాగస్వాములను కల్పిస్తే, ఆయన (సు.తా.) దానిని ఎన్నటికీ క్షమించడు. అది తప్ప ఇతర ఏ పాపాన్నైనా, తాను కోరిన వారిని క్షమించవచ్చు! [2] అంటే ఆరాధించిన వారి మరియు ఆరాధించబడే వారి మధ్య, తీర్పు చేస్తాడు. ఇంకా చూడండి, 34:31-33. [3] చూడండి, 6:22-24

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter