Quran Quote  :  'Allah is Sufficient for us; and what an excellent Guardian He is! - 3:173

కురాన్ - 39:6 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ ثُمَّ جَعَلَ مِنۡهَا زَوۡجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ ٱلۡأَنۡعَٰمِ ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۚ يَخۡلُقُكُمۡ فِي بُطُونِ أُمَّهَٰتِكُمۡ خَلۡقٗا مِّنۢ بَعۡدِ خَلۡقٖ فِي ظُلُمَٰتٖ ثَلَٰثٖۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ لَهُ ٱلۡمُلۡكُۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُصۡرَفُونَ

ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట (జౌజ్) ను పుట్టించాడు. [1] మరియు మీ కొరకు ఎనిమిది జతల (ఆడ మగ) పశువులను పుట్టించాడు. [2] ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో మూడు చీకటి తెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇచ్చాడు. [3] ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా (సత్యం నుండి) తప్పించబడుతున్నారు?

సూరా సూరా జుమర్ ఆయత 6 తఫ్సీర్


[1] చూడండి, 4:1. 'జౌజ: అంటే, జంట, జత, సహచరి, సహవాసి అనే అర్థాలున్నాయి. [2] అంటే గొర్రె, మేక, ఆవు మరియు ఒంటె. ఇవ్ ఆడ-మగ కలిసి ఎనిమిది అవుతాయి, వివరాలు 6:143-144లలో వచ్చాయి. [3] ఈ తెరలు : 1) తల్లి కడుపు (Abdominal Wall), 2) గర్భాశయం (Uterine Wall), 3) మావిపొర (Amniotic Membrane). ఇంకా చూడండి, 22:5, 23:12-14.

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter