Quran Quote  :  Allah creates whatever He wills. Surely Allah has power over everything. - 24:45

కురాన్ - 39:68 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَنُفِخَ فِي ٱلصُّورِ فَصَعِقَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخۡرَىٰ فَإِذَا هُمۡ قِيَامٞ يَنظُرُونَ

మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు. [1]

సూరా సూరా జుమర్ ఆయత 68 తఫ్సీర్


[1] రెండవసారి ఊదబడే బాకాకై చూడండి, 37:19. అబూ-హురైరహ్ కథనం. దైవప్రవక్త ('స'అస) అన్నారు : "రెండవ బాకా ఊదబడిన తరువాత, నేనే అందరి కంటే ముందు తలెత్తి చూస్తాను. అప్పుడు మూసా ('అ.స.) 'అర్ష్ ను పట్టుకొని ఉంటారు. అతను ('అ.స.) ఆ స్థితిలో మొదటి నుండే ఉన్నారా లేక రెండవ బాకా ఊదబడిన తరువాతనా అనేది, నాకు తెలియదు." ('స'హీ'హ్ బు'ఖారీ పు. 6 'హ. నం. 337).

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter