కురాన్ - 35:10 సూరా సూరా ఫాతిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

مَن كَانَ يُرِيدُ ٱلۡعِزَّةَ فَلِلَّهِ ٱلۡعِزَّةُ جَمِيعًاۚ إِلَيۡهِ يَصۡعَدُ ٱلۡكَلِمُ ٱلطَّيِّبُ وَٱلۡعَمَلُ ٱلصَّـٰلِحُ يَرۡفَعُهُۥۚ وَٱلَّذِينَ يَمۡكُرُونَ ٱلسَّيِّـَٔاتِ لَهُمۡ عَذَابٞ شَدِيدٞۖ وَمَكۡرُ أُوْلَـٰٓئِكَ هُوَ يَبُورُ

గౌరవాన్ని కాంక్షించు వాడు తెలుసు కోవాలి, గౌరవమంతా అల్లాహ్ కే చెందుతుందని! మంచి ప్రవచలన్నీ)[1] ఆయన వైపునకు ఎక్కి పోతాయి. మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మరియు ఎవరైతే చెడు కుట్రలు పన్నుతారో![2] వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అలాంటి వారి కుట్ర, అదే! నశించి పోతుంది.

సూరా సూరా ఫాతిర్ ఆయత 10 తఫ్సీర్


[1] మంచి ప్రవచనాలు అంటే, తస్బీ'హ్, ఖుర్ఆన్ పఠించటం, మంచిని ఆదేశించి, చెడునుండి నిరోధించటం మొదలైనవి. [2] మక్ రున్: అంటే Plot, కుట్ర, కపటోపాయం, తంత్రం, ఎత్తుగడ, రహస్యంగా ఇతరులకు హాని కలిగించటానికి పన్నే పన్నాగం. కుఫ్ర్ మరియు షిర్క్ కూడా మక్ర్. ఎందుకంటే, దాని వల్ల అల్లాహ్ (సు.తా.) మార్గానికి హాని కలుగుతుంది. దైవప్రవక్త ('స'అస) ను చంపడానికి మక్కా ముష్రికులు చేసిన మక్ర్. ఇంకా చూడండి, 10:21, 34:33 మరియు 35:43.

సూరా ఫాతిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter