కురాన్ - 35:11 సూరా సూరా ఫాతిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱللَّهُ خَلَقَكُم مِّن تُرَابٖ ثُمَّ مِن نُّطۡفَةٖ ثُمَّ جَعَلَكُمۡ أَزۡوَٰجٗاۚ وَمَا تَحۡمِلُ مِنۡ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلۡمِهِۦۚ وَمَا يُعَمَّرُ مِن مُّعَمَّرٖ وَلَا يُنقَصُ مِنۡ عُمُرِهِۦٓ إِلَّا فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ

మరియు అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు.[1] తరువాత ఇంద్రియ బిందువుతో, ఆ తరువాత మిమ్మల్ని (ఆడ-మగ) జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించనూ జాలదు. గ్రంథంలో వ్రాయబడనిదే, పెరుగుతున్న వాడి వయస్సు పెరగనూ జాలదు మరియు ఎవని వయస్సు తరగనూ జాలదు. నిశ్చయంగా, ఇదంతా అల్లాహ్ కు ఎంతో సులభం.

సూరా సూరా ఫాతిర్ ఆయత 11 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.)తో మరుగైనది ఏదీలేదు. ఇంకా చూడండి, 6:59 భూమిలోపల మరియు తల్లిగర్భంలో ఉండే ప్రతి ఒక్కదాని విషయం అల్లాహ్ (సు.తా.)కు బాగా తెలుసు.

సూరా ఫాతిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter