కురాన్ - 35:18 సూరా సూరా ఫాతిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۚ وَإِن تَدۡعُ مُثۡقَلَةٌ إِلَىٰ حِمۡلِهَا لَا يُحۡمَلۡ مِنۡهُ شَيۡءٞ وَلَوۡ كَانَ ذَا قُرۡبَىٰٓۗ إِنَّمَا تُنذِرُ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَۚ وَمَن تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفۡسِهِۦۚ وَإِلَى ٱللَّهِ ٱلۡمَصِيرُ

మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొకని బరువును మోయడు.[1] మరియు ఒకవేళ బరువు మోసేవాడు, దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా, దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. కాని నిశ్చయంగా, నీవు వారినే హెచ్చరించ గలవు ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో![2] మరియు నమాజ్ ను స్థాపిస్తారో. మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తన స్వంత (లాభం) కొరకే నీతిమంతుడవుతాడు. మరియు (అందరికీ) అల్లాహ్ వైపునకే మరలి పోవలసి ఉన్నది.

సూరా సూరా ఫాతిర్ ఆయత 18 తఫ్సీర్


[1] చూడండి, 6:164, 17:15, 29:13, 39:7, 53:38 23 కాని ఇతరులను సన్మార్గం నుండి నిరోధించేవాడు, లేక తప్పించేవాడు, తన పాపభారంతో పాటు తాను తప్పించిన వారి పాపభారాలను కూడా భరిస్తాడు. [2] విశ్వాసం అంటే అగోచరుడైన అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించటం. ఆయన శక్తి సామర్థ్యాలను గుర్తించి, కేవలం ఆయననే ప్రార్థించటం.

సూరా ఫాతిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter