కురాన్ - 35:32 సూరా సూరా ఫాతిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ أَوۡرَثۡنَا ٱلۡكِتَٰبَ ٱلَّذِينَ ٱصۡطَفَيۡنَا مِنۡ عِبَادِنَاۖ فَمِنۡهُمۡ ظَالِمٞ لِّنَفۡسِهِۦ وَمِنۡهُم مُّقۡتَصِدٞ وَمِنۡهُمۡ سَابِقُۢ بِٱلۡخَيۡرَٰتِ بِإِذۡنِ ٱللَّهِۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَضۡلُ ٱلۡكَبِيرُ

ఆ తరువాత మేము ఈ గ్రంథానికి, మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా చేశాము.[1] వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్న వారున్నారు,[2] మరికొందరు మధ్యస్థంగా ఉండేవారున్నారు,[3] ఇంకా కొందరు అల్లాహ్ సెలవుతో సత్కార్యాలలో మున్ముందు ఉండే వారూ ఉన్నారు.[4] ఇదే ఆ గొప్ప అనుగ్రహం.

సూరా సూరా ఫాతిర్ ఆయత 32 తఫ్సీర్


[1] గ్రంథం అంటే ఖుర్ఆన్, ఎన్నుకున్నవారు అంటే అంటే ము'హమ్మద్ ('స'అస) ను అనుసరించేవారు, ముస్లింలు అని అర్థం. ఇటువంటి ఆయత్ కు చూడండి, 2:143. [2] ము'హమ్మద్ ('స'అస) ఉమ్మత్ లో మూడు రకాల వారున్నారు. వీరు మొదటి రకానికి చెందినవారు : తమకు తాము అన్యాయం చేసుకునే వారున్నారు. వీరు కొన్ని విధు(ఫ'రాయద్)లను ఉపేక్షిస్తారు. మరియు కొన్ని 'హరామ్ - నిషిద్ధ విషయాల నుండి దూరంగా ఉండరు, కాబట్టి వీరిని తమకు తాము అన్యాయం చేసుకున్నవారు అన్నారు. వీరు తమకు తాము అన్యాయం చేసుకున్నందుకు ఇతర రెండు రకాల వారి స్థానాలకు చేరలేక పోతారు. చూడండి, 7:46. [3] వీరు రెండో రకానికి చెందినవారు, మధ్యస్థంగా ఉండేవారు. వీరు కొన్నిసార్లు ముస్త'హబ్ విషయాలను విడిచి పెడతారు. మరియు కొన్ని ము'హర్రమాత్ లను పాటించరు. [4] వీరు మూడో రకానికి చెందినవారు, మొదట పేర్కొన్న ఇద్దరికంటే ధర్మ విషయాలలో మున్ముందు ఉండేవారు.

సూరా ఫాతిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter