కురాన్ - 35:42 సూరా సూరా ఫాతిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَئِن جَآءَهُمۡ نَذِيرٞ لَّيَكُونُنَّ أَهۡدَىٰ مِنۡ إِحۡدَى ٱلۡأُمَمِۖ فَلَمَّا جَآءَهُمۡ نَذِيرٞ مَّا زَادَهُمۡ إِلَّا نُفُورًا

మరియు, ఒకవేళ హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వస్తే! వారు తప్పక, ఇతర సమాజాల వారి కంటే ఎక్కువగా సన్మార్గం మీద ఉండేవారని అల్లాహ్ సాక్షిగా గట్టి ప్రమాణాలు చేస్తారు.[1] కాని హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వచ్చినపుడు మాత్రం (అతని రాక) వారి వ్యతిరేకతను తప్ప మరేమీ అధికం చేయలేక పోయింది;[2]

సూరా సూరా ఫాతిర్ ఆయత 42 తఫ్సీర్


[1] చూ"హెచ్చరిక చేసేవాడు వస్తే మేము తప్పక సన్మార్గం మీద ఉంటాము." అని ఈ ముష్రిక్ లు గట్టి ప్రమాణాలు చేశారు. కానీ, అతను వచ్చిన తరువాత అతనిని తిరస్కరించారు. ఇంకా చూడండి, 6:156-157, 37:168-170. [2] అంటే ము'హమ్మద్ ('స'అస) వచ్చిన తరువాత కూడా అతనిని తిరస్కరించారు.

సూరా ఫాతిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter