కురాన్ - 41:50 సూరా సూరా హామీమ్ సజ్దా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَئِنۡ أَذَقۡنَٰهُ رَحۡمَةٗ مِّنَّا مِنۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَآ أَظُنُّ ٱلسَّاعَةَ قَآئِمَةٗ وَلَئِن رُّجِعۡتُ إِلَىٰ رَبِّيٓ إِنَّ لِي عِندَهُۥ لَلۡحُسۡنَىٰۚ فَلَنُنَبِّئَنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِمَا عَمِلُواْ وَلَنُذِيقَنَّهُم مِّنۡ عَذَابٍ غَلِيظٖ

మరియు ఒకవేళ మేము అతనికి ఆపద కాలం దాటి పోయిన తర్వాత మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే అతడు తప్పకుండా ఇలా అంటాడు: "ఇది నా హక్కే! మరియు పునరుత్థాన దినం వస్తుందని నేను భావించను. మరియు ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా! నిశ్చయంగా, నాకు ఆయన దగ్గర మేలే ఉంటుంది." కాని మేము సత్యతిరస్కారులకు వారు చేసిన కర్మలను గురించి వారికి తప్పక తెలుపుతాము మరియు వారికి భయంకరమైన శిక్షను రుచి చూపిస్తాము.

సూరా హామీమ్ సజ్దా అన్ని ఆయతలు

Sign up for Newsletter