కురాన్ - 11:8 సూరా సూరా హూద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَئِنۡ أَخَّرۡنَا عَنۡهُمُ ٱلۡعَذَابَ إِلَىٰٓ أُمَّةٖ مَّعۡدُودَةٖ لَّيَقُولُنَّ مَا يَحۡبِسُهُۥٓۗ أَلَا يَوۡمَ يَأۡتِيهِمۡ لَيۡسَ مَصۡرُوفًا عَنۡهُمۡ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ

మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం[1] వరకు ఆపి ఉంచితే, వారు తప్పకుండా అంటారు: "దానిని ఆపుతున్నది ఏమిటీ?" వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది.

సూరా సూరా హూద్ ఆయత 8 తఫ్సీర్


[1] ఉమ్మతున్: ఇక్కడ కాలం, అనే అర్థంలో వాడబడింది. (ఫ'త్హ అల్ 'ఖదీర్). ఏ విధంగానైతే 12:45లో వాడబడిందో. 16:120లో ఈ పదం ఇమామ్, నాయకుడనే అర్థంలో మరియు 43:23లో ధర్మం అనే అర్థంలో మరియు 28:23, 7:159, 10:47లలో సమాజం, సంఘం, తెగ అనే అర్థాలలో వాడబడింది (ఇబ్నె-కసీ'ర్).

సూరా హూద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter