కురాన్ - 14:37 సూరా సూరా ఇబ్రాహీం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

رَّبَّنَآ إِنِّيٓ أَسۡكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيۡرِ ذِي زَرۡعٍ عِندَ بَيۡتِكَ ٱلۡمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُواْ ٱلصَّلَوٰةَ فَٱجۡعَلۡ أَفۡـِٔدَةٗ مِّنَ ٱلنَّاسِ تَهۡوِيٓ إِلَيۡهِمۡ وَٱرۡزُقۡهُم مِّنَ ٱلثَّمَرَٰتِ لَعَلَّهُمۡ يَشۡكُرُونَ

ఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం (కఅబహ్) దగ్గర, పైరు పండని, ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను.[1] ఓ మా ప్రభూ! వారిని అక్కడ నమాజ్ స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారి వైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు.

సూరా సూరా ఇబ్రాహీం ఆయత 37 తఫ్సీర్


[1] ఇస్మాయీల్ ('అ.స.), అతని తల్లి హాజర్ ('అ.స.) లు మరియు వారి సంతతివారు.

సూరా ఇబ్రాహీం అన్ని ఆయతలు

Sign up for Newsletter