కురాన్ - 47:36 సూరా సూరా మహమ్మద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا لَعِبٞ وَلَهۡوٞۚ وَإِن تُؤۡمِنُواْ وَتَتَّقُواْ يُؤۡتِكُمۡ أُجُورَكُمۡ وَلَا يَسۡـَٔلۡكُمۡ أَمۡوَٰلَكُمۡ

నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్ని కూడా అడగడు.[1]

సూరా సూరా మహమ్మద్ ఆయత 36 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) కు మీ ధనం అవసరం లేదు. మదీనా కాలపు మొదటి రోజులలోనే 'జకాత్ విధించబడింది. అది ఇస్లాం ధర్మాన్ని కాపాడుకోవటానికి దాని ప్రచారానికి మరియు ముస్లింల కుశలత కొరకు వారి సౌకర్యాల కొరకు. 'జకాత్ ఒక సంవత్సరం వరకు జమ ఉన్న ధనసంపత్తుల మీద, 2.5% మాత్రమే. సంవత్సరం గడిచిన పిదపనే 'జకాత్ ఇవ్వవలసి ఉంటుంది.

సూరా మహమ్మద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter