కురాన్ - 20:68 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡنَا لَا تَخَفۡ إِنَّكَ أَنتَ ٱلۡأَعۡلَىٰ

మేము (అల్లాహ్) అన్నాము: "భయపడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు.[1]

సూరా సూరా తాహా ఆయత 68 తఫ్సీర్


[1] మూసా ('అ.స.) భయపడటానికి కారణం అతను కూడా ఒక మానవుడే. ప్రవక్త ('అలైహిమ్. స.) లు అందరూ మానవులే కాని వారిపై దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడుతుంది. అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప, వేరే అగోచర జ్ఞానం గానీ, భవిష్యత్తులో జరుగబోయే వాటి జ్ఞానం గానీ వారికి ఉండదు. అల్లాహ్ (సు.తా.): 'భయపడకు నీవే ఆధిక్యత వహిస్తావు.' అని అన్నప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. అంటే అద్భుత సూచనలు చూపటం కూడా అల్లాహ్ (సు.తా.) చేతిలోనే ఉంది. ప్రవక్తలు ఏదైనా అద్భుత విషయం జరిగే వరకు, అది జరుగనున్నదని ఎరగరు. అంటే వారికెలాంటి అగోచర జ్ఞానం ఉండదు.

Sign up for Newsletter