కురాన్ - 20:7 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِن تَجۡهَرۡ بِٱلۡقَوۡلِ فَإِنَّهُۥ يَعۡلَمُ ٱلسِّرَّ وَأَخۡفَى

మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే గాక) అతి గోప్యమైన మాటలు కూడా, తెలుస్తాయి.[1]

సూరా సూరా తాహా ఆయత 7 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) ను పెద్ద స్వరంతో అర్థించే అవసరం లేదు. ఎందుకంటే ఆయన అతి రహస్య విషయాలను కూడా తెలుసుకుంటాడు. ఆయనకు మానవుల భవిష్యత్తు కూడా తెలుసు. అది ఆయన దగ్గర వ్రాయబడి ఉంది! ఆయనకు జరిగిపోయిందే గాక, జరుగుతున్నది మరియు ముందు జరగబోయేది అన్నీ తెలుసు. అంటే పునరుత్థాన దినం వరకు మరియు ఆ తరువాత కూడా ఎల్లప్పుడూ జరుగబోయే అన్ని విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ (సు.తా.) కే ఉంది మరియు ఇతరులకు ఎవ్వరికీ లేదు. అంటే దైవప్రవక్తలు, దైవదూత ('అలైహిమ్.స.)లకు మరియు జిన్నాతులకు కూడా లేదు.

Sign up for Newsletter