కురాన్ - 17:51 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَوۡ خَلۡقٗا مِّمَّا يَكۡبُرُ فِي صُدُورِكُمۡۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَاۖ قُلِ ٱلَّذِي فَطَرَكُمۡ أَوَّلَ مَرَّةٖۚ فَسَيُنۡغِضُونَ إِلَيۡكَ رُءُوسَهُمۡ وَيَقُولُونَ مَتَىٰ هُوَۖ قُلۡ عَسَىٰٓ أَن يَكُونَ قَرِيبٗا

"లేదా! తిరిగి సృష్టింపబడటానికి అసాధ్యమైనదని మీ హృదయాలు భావించే దానిగా ఉన్నా సరే! (తిరిగి లేపబడతారు)". వారు మళ్ళీ ఇలా అడుగుతారు: "మమ్మల్ని తిరిగి బ్రతికించి లేపగల వాడు ఎవడు?" వారితో అను: "ఆయనే, మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన వాడు!" వారు ఎగతాళిగా తలలు ఊపుతూ అంటారు: "అయితే! అది ఎప్పుడు సంభవిస్తుంది?" వారితో అను: "బహుశా ఆ సమయం సమీపంలోనే ఉండవచ్చు!"

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter