Quran Quote  :  Verily this Qur'an guides to the Way that is the Straight most. - 17:9

కురాన్ - 17:60 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذۡ قُلۡنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِٱلنَّاسِۚ وَمَا جَعَلۡنَا ٱلرُّءۡيَا ٱلَّتِيٓ أَرَيۡنَٰكَ إِلَّا فِتۡنَةٗ لِّلنَّاسِ وَٱلشَّجَرَةَ ٱلۡمَلۡعُونَةَ فِي ٱلۡقُرۡءَانِۚ وَنُخَوِّفُهُمۡ فَمَا يَزِيدُهُمۡ إِلَّا طُغۡيَٰنٗا كَبِيرٗا

"నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడు." అని మేము నీతో చెప్పిన విషయం (జ్ఞాపకం చేసుకో)! మేము నీకు (ఇస్రా రాత్రిలో) చూపిన దృశ్యం[1] - మరియు ఖుర్ఆన్ లో శపించబడిన (నరక) వృక్షం[2] - మేము వారికి ఒక పరీక్షగా చేశాము. కాని మా భయ పెట్టడం, వారి తలబిరుసుతనాన్ని మాత్రమే మరింత అధికం చేస్తున్నది.

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 60 తఫ్సీర్


[1] దైవప్రవక్త ('స'అస) యొక్క రాత్రివేళ మస్జిద్ అల్-'హరాం నుండి మస్జిద్ అల్ అ'ఖ్సా మరియు అక్కడ నుండి సప్తాకాశాలలోనికి పోవటం మరియు తమ ప్రయాణాలలో సాక్షాత్తుగా చూసిన దృశ్యాల వివరణ విశ్వాసులకు వారి విశ్వాసాన్ని అధికం చేసింది మరియు సత్యతిరస్కారులకు వారి తలబిరుసుతనాన్ని. [2] ఆ నరకవృక్షఫలాలు, నరకవాసులకు ఆహారంగా ఇవ్వబడతాయి. దాని పేరు 'జఖ్ఖూమ్ (జెముడు వృక్షం). దాని వివరాలకు చూడండి, 37:62-66 44:43-44.

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter