కురాన్ - 30:39 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَآ ءَاتَيۡتُم مِّن رِّبٗا لِّيَرۡبُوَاْ فِيٓ أَمۡوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرۡبُواْ عِندَ ٱللَّهِۖ وَمَآ ءَاتَيۡتُم مِّن زَكَوٰةٖ تُرِيدُونَ وَجۡهَ ٱللَّهِ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡمُضۡعِفُونَ

మరియు మీరు ప్రజలకు - రిబా[1] (వడ్డీ మీద డబ్బు /కానుకలు) ఇచ్చి దాని ద్వారా వారి సంపద నుండి వృద్ధి పొందాలని - ఇచ్చే ధనం, అల్లాహ్ దృష్టిలో ఏ మాత్రం వృద్ధి పొందదు. మరియు మీరు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశంతో ఏదైనా దానం (జకాత్) చేస్తే అలాంటి వారి (సంపద) ఎన్నో రెట్లు అధికమవుతుంది.

సూరా సూరా రూమ్ ఆయత 39 తఫ్సీర్


[1] రిబా': వడ్డీ అనే పదం ఖుర్ఆన్ అవతరణా క్రమంలో ఈ ఆయత్ లో మొదటిసారి వచ్చింది. దాని అర్థం : ఏదైనా ఇచ్చి - ఇచ్చిన దానికంటే - ఎక్కువ తీసుకోవటం. ఇబ్నె 'అబ్బాస్ మరియు చాలామంది ఇతర 'స'హాబీలు ('రది.'అన్హుమ్) ఈ ఆయత్ లో వచ్చిన పదం రిబా' అంటే ఈ విధమైన వ్యాఖ్యానం కూడా ఇచ్చారు: ఒక పేదవాడు ఒక ధనవంతునికి లేక ఒక వ్యక్తి తన రాజుకు, లేక ఒక సేవకుడు తనను పెట్టుకున్న వానికి, తాను ఇచ్చిన దాని కంటే ఎక్కువ తిరిగి వచ్చుననే ఆశతో, ఇచ్చే బహుమానం, అని. ఇచ్చేటప్పుడు, ఎక్కువ తిరిగి వస్తుంది అనే భావన ఉండటం వల్లనే, ఇది నిషిద్ధం చేయబడింది (ఇబ్నె-కసీ'ర్, అయ్ సర్ అత్తఫాసీర్). చూడండి, 3:130 మరియు 2:275-281..

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter