(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు.[1] కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు.[2] మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.
సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 40 తఫ్సీర్
[1] అంటే అతను ('స'అస), 'జైద్ బిన్-'హారిసా (ర'ది.'అ.) యొక్క తండ్రి కారు. మరియు ఏ ఇతర పురుషుని తండ్రి కూడా కారు. ప్రతివాడు తన నిజతండ్రి పేరుతోనే పిలువబడాలి. దైవప్రవక్త ('స'అస) కు 'ఖదీజహ్ (ర.'అన్హా) నుండి ముగ్గురు కుమారులు: ఖాసిమ్, 'తయ్యబ్ మరియు 'తాహిర్. మారియా ఖబ్తియా (ర.'అన్హా) నుండి ఇబ్రాహీం. వారంతా బాల్యావస్థలోనే మరణించారు, (ఇబ్నె-కసీ'ర్, ము'హమ్మద్ జూనాగఢి). కొందరు వ్యాఖ్యాతలు 'ఖదీజహ్ (ర.'అన్హా)కు ఇద్దరు కుమారులే అని అంటారు: ఖాసిమ్ మరియు అబ్దుల్లాహ్. 'తయ్యబ్, 'తాహిహ్ అనేవి అబ్దుల్లాహ్ యొక్క మారు పేర్లు అని వారంటారు.
[2] 'ఖాతమున్: అంటే ముద్ర. ముద్రవేయటం చివరిపని, కావున దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తరువాత ఇక ఏ ప్రవక్త కూడా రాడు. కాబట్టి అతను ప్రవక్తల ముద్ర (చివరివాడు), అని సంబోధించబడ్డారు. కావున అతన తరువాత తనను తాను ప్రవక్తగా పరిగణించేవాడు, అసత్యుడూ, దజ్జాల్ మాత్రమే! చివరికాలంలో దైవప్రవక్త 'ఈసా ('అ.స.) తిరిగి వస్తారు. కానీ అతను ప్రవక్తగా గాక ము'హమ్మద్ ('స'అస) యొక్క ఉమ్మతి (అనుచరునిగా) వస్తారు. ఇదంతా స'హీ 'హదీసులలో ఉంది. చాలా మంది ధర్మవేత్తల అభిప్రాయం ఇదే! అతను ('స'అస) చివరి ప్రవక్త కాబట్టి సమస్తలోకాలకు ప్రవక్తగా పంపబడ్డారు. చూడండి, 21:107.
సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 40 తఫ్సీర్