ఓ విశ్వాసులారా! వ్యక్త పరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్ఆన్ అవతరింప జేయబడే టప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచ బడవచ్చు! వాటి కొరకు (ఇంత వరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.