Quran Quote  :  And the people of the Fire will cry out to the people of Paradise: 'Pour out some water on us or throw at us something of what Allah has bestowed upon you.' They will reply: 'Allah has forbidden them to the deniers of the truth, - 7:50

కురాన్ - 5:105 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ عَلَيۡكُمۡ أَنفُسَكُمۡۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا ٱهۡتَدَيۡتُمۡۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైన వారు మీకు ఎలాంటి హాని చేయలేరు.[1] మీరంతా అల్లాహ్ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండే వారో మీకు తెలియజేస్తాడు.

సూరా సూరా మైదా ఆయత 105 తఫ్సీర్


[1] ప్రజలు ఈ ఆయత్ ను సరిగ్గా అర్థం చేసుకోలేనందువలన అబూ బక్ర్ సిద్ధీఖ్ (ర'ది.'అ) వారితో ఇలా అన్నారు: "ప్రజలారా! నేను దైవప్రవక్త ('స'అస) ను ఇలా అంటుండగా విన్నాను: 'ప్రజలు చెడు జరుగుతుండగా చూసి, దానిని మార్చటానికి ప్రయత్నం చేయకుంటే త్వరలోనే అల్లాహ్ (సు.తా.) వారిని తన శిక్షకు గురి చేయవచ్చు!' " (ముస్నద్ అ'హ్మద్ పుస్తకము - 1, పేజీ - 5. తిర్మిజీ', 'హదీస్' నం. 2178; అబూ దావూద్, 'హదీస్' నం. 4338). ఈ ఆయత్ అర్థం ఏమిటంటే : మీరు సన్మార్గం మీద ఉండి, చెడు నుండి దూరంగా ఉంటూ, ప్రజలకు సన్మార్గం చూపుతూ దుర్మార్గం నుండి ఆపుతూ ఉంటే, వారు మీ మాటను లక్ష్యపెట్టనిచో మీ పని మీరు చేశారు. దానికి ప్రతిఫలం పొందుతారు. కాని మీ ప్రాణానికి హాని కలిగే భయం ఉంటే! మీరు: 'అమ్ర్ బిల్ మ'అరూఫ్ వ నహా 'అనిల్ మున్కర్.' ను ఉపేక్షించవచ్చు!

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter