కురాన్ - 6:91 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦٓ إِذۡ قَالُواْ مَآ أَنزَلَ ٱللَّهُ عَلَىٰ بَشَرٖ مِّن شَيۡءٖۗ قُلۡ مَنۡ أَنزَلَ ٱلۡكِتَٰبَ ٱلَّذِي جَآءَ بِهِۦ مُوسَىٰ نُورٗا وَهُدٗى لِّلنَّاسِۖ تَجۡعَلُونَهُۥ قَرَاطِيسَ تُبۡدُونَهَا وَتُخۡفُونَ كَثِيرٗاۖ وَعُلِّمۡتُم مَّا لَمۡ تَعۡلَمُوٓاْ أَنتُمۡ وَلَآ ءَابَآؤُكُمۡۖ قُلِ ٱللَّهُۖ ثُمَّ ذَرۡهُمۡ فِي خَوۡضِهِمۡ يَلۡعَبُونَ

మరియు వారు: "అల్లాహ్, ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయ లేదు."[1] అని పలికినప్పుడు, వారు (అవిశ్వాసులు) అల్లాహ్ ను గురించి తగు రీతిలో అంచనా వేయలేదు. వారిలో ఇలా అను: "అయితే! మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని, మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు (యూదులు) విడి పత్రాలుగా చేసి (దానిలోని కొంత భాగాన్ని) చుపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకూ మరియు మీ తండ్రితాతలకూ తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా?" ఇంకా ఇలా అను:"అల్లాహ్ యే (దానిని అవతరింపజేశాడు)." ఆ పిదప వారిని, వారి పనికిమాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు!

సూరా సూరా అనాం ఆయత 91 తఫ్సీర్


[1] చూడండి, 10:2 మరియు 17:94.

Sign up for Newsletter