కురాన్ - 9:80 సూరా సూరా తౌబా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱسۡتَغۡفِرۡ لَهُمۡ أَوۡ لَا تَسۡتَغۡفِرۡ لَهُمۡ إِن تَسۡتَغۡفِرۡ لَهُمۡ سَبۡعِينَ مَرَّةٗ فَلَن يَغۡفِرَ ٱللَّهُ لَهُمۡۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَفَرُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ,

(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు.[1] ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు.[2]

సూరా సూరా తౌబా ఆయత 80 తఫ్సీర్


[1] దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తన శత్రువులను క్షమించమని అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థించినట్లు బు'ఖారీ, ముస్లిం మరియు ఇతరుల 'స'హీ'హ్ 'హదీస్'ల ద్వారా తెలుస్తుంది. [2] చూడండి, 76:3.

సూరా తౌబా అన్ని ఆయతలు

Sign up for Newsletter