కురాన్ - 36:36 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

سُبۡحَٰنَ ٱلَّذِي خَلَقَ ٱلۡأَزۡوَٰجَ كُلَّهَا مِمَّا تُنۢبِتُ ٱلۡأَرۡضُ وَمِنۡ أَنفُسِهِمۡ وَمِمَّا لَا يَعۡلَمُونَ

భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన ఆయన (అల్లాహ్) లోపాలకు అతీతుడు.[1]

సూరా సూరా యాసీన్ ఆయత 36 తఫ్సీర్


[1] సృష్టిలో నున్న ప్రతి వస్తువు జతలలో ఉన్నది. అవి జీవులు కానీ, నిర్జీవులు కానీ. జీవరాసులలో మరియు వృక్షరాసులలో ఆడ-మగ; చీకటి-వెలుగులు, చలి-వేడి, విద్యుచ్ఛక్తి మరియు అయస్కాంతాలలో ఉన్న ఆకర్షణా (+) మరియు వికర్షణా (-) శక్తులు, మొదలైనవి. కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే ఏకైకుడు.

సూరా యాసీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter