కురాన్ - 36:69 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا عَلَّمۡنَٰهُ ٱلشِّعۡرَ وَمَا يَنۢبَغِي لَهُۥٓۚ إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ وَقُرۡءَانٞ مُّبِينٞ

మరియు మేము అతనికి (ముహమ్మద్ కు) కవిత్వం నేర్పలేదు.[1] మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్ఆన్) మాత్రమే. [2]

సూరా సూరా యాసీన్ ఆయత 69 తఫ్సీర్


[1] మక్కా ముష్రికులు దైవప్రవక్త ('స'అస) ను వివిధ ఆరోపణలతో పీడించేవారు. వాటిలో ఒకటి ఇతను ('స'అస) కవిత్వం చెబుతున్నాడని. దానికి అల్లాహ్ (సు.తా.) ఇక్కడ జవాబిస్తున్నాడు: ఒకవేళ ఇది కవిత్వం అయితే మీరు దీని వంటి ఒక్క సూరహ్ నైనా రచించి తీసుకురండని. కాని దానిని ఎవ్వరూ ఈ రోజు వరకు పూర్తి చేయలేక పోయారు. ఇంకా చూడండి, 26:224-226. [2] చూడండి, 15:1

సూరా యాసీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter