కురాన్ - 10:98 సూరా సూరా యూనుస అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَلَوۡلَا كَانَتۡ قَرۡيَةٌ ءَامَنَتۡ فَنَفَعَهَآ إِيمَٰنُهَآ إِلَّا قَوۡمَ يُونُسَ لَمَّآ ءَامَنُواْ كَشَفۡنَا عَنۡهُمۡ عَذَابَ ٱلۡخِزۡيِ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَمَتَّعۡنَٰهُمۡ إِلَىٰ حِينٖ

యూనుస్ జాతివారు తప్ప! ఇతర ఏ పురవాసులకు కూడా, (శిక్షను చూసిన తరువాత) విశ్వసించగా, వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేక పోయింది! (యూనుస్ జాతి) వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము. మరియు వారిని కొంతకాలం వరకు వారికి (ఇహలోక జీవితాన్ని) అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము.[1]

సూరా సూరా యూనుస ఆయత 98 తఫ్సీర్


[1] యూనుస్ ('అ.స.) 'నైనవా' (Nineveh) వాసులకు ధర్మప్రచారం చేశారు. కాని వారతనిని తిరస్కరించారు. దానికి అతను కోపపడి ఉద్రేకంతో వారిని శపించి వెళ్ళిపోయారు. వారి పైకి శిక్ష రావడం చూసి ప్రజలందరూ ఒక మైదానంలో చేరుకొని అల్లాహ్ (సు.తా.) ను మన్నించమని ప్రార్థించారు. వారి క్షమాపణను అంగీకరించి అల్లాహ్ (సు.తా.) వారి శిక్షను తొలగించాడు. ఆ తరువాత వారు అల్లాహ్ (సు.తా.)కు విధేయు(ముస్లిం)లయ్యారు. ఈ విధంగా శిక్షను చూసిన తరువాత క్షమాపణ అంగీకరించబడిన వారు కేవలం యూనుస్ ('అ.స.) జాతి ప్రజలు మాత్రమే. ఇంకా చూడండి, 21:87-88, 37:139-148, (ఫ'త్హ అల్ -'ఖదీర్).

సూరా యూనుస అన్ని ఆయతలు

Sign up for Newsletter