بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱذۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ هَمَّ قَوۡمٌ أَن يَبۡسُطُوٓاْ إِلَيۡكُمۡ أَيۡدِيَهُمۡ فَكَفَّ أَيۡدِيَهُمۡ عَنكُمۡۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ
ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచినపుడు, అల్లాహ్ వారి చేతులను మీ నుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్ పైననే నమ్మక ముంచుకుంటారు.
۞وَلَقَدۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ بَنِيٓ إِسۡرَـٰٓءِيلَ وَبَعَثۡنَا مِنۡهُمُ ٱثۡنَيۡ عَشَرَ نَقِيبٗاۖ وَقَالَ ٱللَّهُ إِنِّي مَعَكُمۡۖ لَئِنۡ أَقَمۡتُمُ ٱلصَّلَوٰةَ وَءَاتَيۡتُمُ ٱلزَّكَوٰةَ وَءَامَنتُم بِرُسُلِي وَعَزَّرۡتُمُوهُمۡ وَأَقۡرَضۡتُمُ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا لَّأُكَفِّرَنَّ عَنكُمۡ سَيِّـَٔاتِكُمۡ وَلَأُدۡخِلَنَّكُمۡ جَنَّـٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ فَمَن كَفَرَ بَعۡدَ ذَٰلِكَ مِنكُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ
మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్ కు) పోవటానికి నాయకులుగా నియమించాము.[1] మరియు అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు నమాజ్ స్థిరంగా సలుపుతూ, విధి దానం (జకాత్) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పి పోయిన వాడే!"
فَبِمَا نَقۡضِهِم مِّيثَٰقَهُمۡ لَعَنَّـٰهُمۡ وَجَعَلۡنَا قُلُوبَهُمۡ قَٰسِيَةٗۖ يُحَرِّفُونَ ٱلۡكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَنَسُواْ حَظّٗا مِّمَّا ذُكِّرُواْ بِهِۦۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَآئِنَةٖ مِّنۡهُمۡ إِلَّا قَلِيلٗا مِّنۡهُمۡۖ فَٱعۡفُ عَنۡهُمۡ وَٱصۡفَحۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ
ఆ పిదప వారు తాము చేసిన ఒడంబడికను భంగం చేసినందుకు, మేము వారిని శపించాము (బహిష్కరించాము) మరియు వారి హృదయాలను కఠినం చేశాము. వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చి వేసేవారు.[1] వారికి ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు. అనుదినం వారిలో ఏ కొందరో తప్ప, పలువురు చేసే ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంది. కనుక వారిని మన్నించు మరియు వారి చేష్టలను ఉపేక్షించు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.
وَمِنَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّا نَصَٰرَىٰٓ أَخَذۡنَا مِيثَٰقَهُمۡ فَنَسُواْ حَظّٗا مِّمَّا ذُكِّرُواْ بِهِۦ فَأَغۡرَيۡنَا بَيۡنَهُمُ ٱلۡعَدَاوَةَ وَٱلۡبَغۡضَآءَ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِۚ وَسَوۡفَ يُنَبِّئُهُمُ ٱللَّهُ بِمَا كَانُواْ يَصۡنَعُونَ
"మేము క్రైస్తవులము." అని అనే వారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచి పోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు.
يَـٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُولُنَا يُبَيِّنُ لَكُمۡ كَثِيرٗا مِّمَّا كُنتُمۡ تُخۡفُونَ مِنَ ٱلۡكِتَٰبِ وَيَعۡفُواْ عَن كَثِيرٖۚ قَدۡ جَآءَكُم مِّنَ ٱللَّهِ نُورٞ وَكِتَٰبٞ مُّبِينٞ
ఓ గ్రంథ ప్రజలారా! వాస్తవంగా మా ప్రవక్త (ముహమ్మద్) మీ వద్దకు వచ్చి వున్నాడు; మీరు కప్పి పుచ్చుతూ ఉన్న గ్రంథం (బైబిల్) లోని ఎన్నో విషయాలను అతను మీకు బహిర్గతం చేస్తున్నాడు; మరియు ఎన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. వాస్తవంగా మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక జ్యోతి మరియు ఒక స్పష్టమైన గ్రంథం (ఈ ఖుర్ఆన్) వచ్చి వున్నది.[1]
يَهۡدِي بِهِ ٱللَّهُ مَنِ ٱتَّبَعَ رِضۡوَٰنَهُۥ سُبُلَ ٱلسَّلَٰمِ وَيُخۡرِجُهُم مِّنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ بِإِذۡنِهِۦ وَيَهۡدِيهِمۡ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ
దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
لَّقَدۡ كَفَرَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡمَسِيحُ ٱبۡنُ مَرۡيَمَۚ قُلۡ فَمَن يَمۡلِكُ مِنَ ٱللَّهِ شَيۡـًٔا إِنۡ أَرَادَ أَن يُهۡلِكَ ٱلۡمَسِيحَ ٱبۡنَ مَرۡيَمَ وَأُمَّهُۥ وَمَن فِي ٱلۡأَرۡضِ جَمِيعٗاۗ وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۚ يَخۡلُقُ مَا يَشَآءُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
"నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు."[1]
وَقَالَتِ ٱلۡيَهُودُ وَٱلنَّصَٰرَىٰ نَحۡنُ أَبۡنَـٰٓؤُاْ ٱللَّهِ وَأَحِبَّـٰٓؤُهُۥۚ قُلۡ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُمۖ بَلۡ أَنتُم بَشَرٞ مِّمَّنۡ خَلَقَۚ يَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۚ وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۖ وَإِلَيۡهِ ٱلۡمَصِيرُ
మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: "మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము."[1] (వారితో) ఇలా అను: "అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలా కాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్ దే మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది."
يَـٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُولُنَا يُبَيِّنُ لَكُمۡ عَلَىٰ فَتۡرَةٖ مِّنَ ٱلرُّسُلِ أَن تَقُولُواْ مَا جَآءَنَا مِنۢ بَشِيرٖ وَلَا نَذِيرٖۖ فَقَدۡ جَآءَكُم بَشِيرٞ وَنَذِيرٞۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
ఓ గ్రంథ ప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగి పోయిన కొంత కాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశహరుడు (ముహమ్మద్) మీ వద్దకు వచ్చాడు. మీరు : "మా వద్దకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు." అని అనకూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు వచ్చి వున్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ ٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ جَعَلَ فِيكُمۡ أَنۢبِيَآءَ وَجَعَلَكُم مُّلُوكٗا وَءَاتَىٰكُم مَّا لَمۡ يُؤۡتِ أَحَدٗا مِّنَ ٱلۡعَٰلَمِينَ
మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు.[1] మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు."