بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
۞يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ ٱلۡيَهُودَ وَٱلنَّصَٰرَىٰٓ أَوۡلِيَآءَۘ بَعۡضُهُمۡ أَوۡلِيَآءُ بَعۡضٖۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمۡ فَإِنَّهُۥ مِنۡهُمۡۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّـٰلِمِينَ
ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. వారు ఒకరి కొకరు స్నేహితులు.[1] మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.
فَتَرَى ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ يُسَٰرِعُونَ فِيهِمۡ يَقُولُونَ نَخۡشَىٰٓ أَن تُصِيبَنَا دَآئِرَةٞۚ فَعَسَى ٱللَّهُ أَن يَأۡتِيَ بِٱلۡفَتۡحِ أَوۡ أَمۡرٖ مِّنۡ عِندِهِۦ فَيُصۡبِحُواْ عَلَىٰ مَآ أَسَرُّواْ فِيٓ أَنفُسِهِمۡ نَٰدِمِينَ
కావున ఎవరి హృదయాలలో రోగం (కాపట్యం) ఉందో వారు, వారి సాంగత్యం కొరకు పోటీ పడుతున్నది నీవు చూస్తున్నావు. వారు: "మాపై ఏదైనా ఆపద రాగలదని మేము భయపడుతున్నాము." అని అంటారు. బహుశా అల్లాహ్ (విశ్వాసులకు) విజయాన్ని గానీ, లేదా తన దిక్కు నుండి ఏదైనా అవకాశాన్ని గానీ కలిగించవచ్చు! అప్పుడు వారు తమ మనస్సులలో దాచి ఉంచిన దానికి పశ్చాత్తాప పడతారు.
وَيَقُولُ ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَهَـٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ إِنَّهُمۡ لَمَعَكُمۡۚ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فَأَصۡبَحُواْ خَٰسِرِينَ
మరియు విశ్వాసులు (పరస్పరం ఇలా అనుకుంటారు): "ఏమీ? వాస్తవానికి మేము మీతోనే ఉన్నామని, అల్లాహ్ పేరుతో కఠోర ప్రమాణాలు చేసి, నమ్మకం కలిగించే వారు వీరేనా?" వారి (కపటవిశ్వాసుల) కర్మలన్నీ వ్యర్థమై, వారు నష్టపడిన వారవుతారు!
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ مَن يَرۡتَدَّ مِنكُمۡ عَن دِينِهِۦ فَسَوۡفَ يَأۡتِي ٱللَّهُ بِقَوۡمٖ يُحِبُّهُمۡ وَيُحِبُّونَهُۥٓ أَذِلَّةٍ عَلَى ٱلۡمُؤۡمِنِينَ أَعِزَّةٍ عَلَى ٱلۡكَٰفِرِينَ يُجَٰهِدُونَ فِي سَبِيلِ ٱللَّهِ وَلَا يَخَافُونَ لَوۡمَةَ لَآئِمٖۚ ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్ త్వరలోనే ఇతర ప్రజలను తేగలడు. ఆయన వారిని ప్రేమిస్తాడు[1] మరియు వారు ఆయన (అల్లాహ్) ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగా, సత్యతిరస్కారుల పట్ల కఠినంగా ప్రవర్తించే వారునూ, అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసే వారూను మరియు నిందించే వారి నిందలకు భయపడని వారూనూ, అయి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వోపగతుడు (సర్వవ్యాప్తి), సర్వజ్ఞుడు.
إِنَّمَا وَلِيُّكُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ وَٱلَّذِينَ ءَامَنُواْ ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُمۡ رَٰكِعُونَ
నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు: ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో, విధిదానం (జకాత్) ఇస్తూ ఉంటారో మరియు వారు (అల్లాహ్ ముందు) వంగుతూ (రుకూఉ చేస్తూ) ఉంటారో;
وَمَن يَتَوَلَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَٱلَّذِينَ ءَامَنُواْ فَإِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡغَٰلِبُونَ
మరియు ఎవరు అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారి వైపునకు మరలుతారో! నిశ్చయంగా, వారే అల్లాహ్ పక్షానికి చెందినవారు, వారే విజయం సాధించేవారు.[1]
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ ٱلَّذِينَ ٱتَّخَذُواْ دِينَكُمۡ هُزُوٗا وَلَعِبٗا مِّنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَٱلۡكُفَّارَ أَوۡلِيَآءَۚ وَٱتَّقُواْ ٱللَّهَ إِن كُنتُم مُّؤۡمِنِينَ
ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజలైనా, లేదా సత్యతిరస్కారులైనా, వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
وَإِذَا نَادَيۡتُمۡ إِلَى ٱلصَّلَوٰةِ ٱتَّخَذُوهَا هُزُوٗا وَلَعِبٗاۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡقِلُونَ
మరియు మీరు నమాజ్ కొరకు పిలుపు (అజాన్) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా, నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు![1]
قُلۡ يَـٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ هَلۡ تَنقِمُونَ مِنَّآ إِلَّآ أَنۡ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ مِن قَبۡلُ وَأَنَّ أَكۡثَرَكُمۡ فَٰسِقُونَ
వారితో ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! ఏమీ? మేము అల్లాహ్ ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామనే, మీరు మమ్మల్ని పీడిస్తున్నారా? మరియు నిశ్చయంగా, మీలో చాలా మంది అవిధేయులు (దుష్టులు) ఉన్నారు!"
قُلۡ هَلۡ أُنَبِّئُكُم بِشَرّٖ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ ٱللَّهِۚ مَن لَّعَنَهُ ٱللَّهُ وَغَضِبَ عَلَيۡهِ وَجَعَلَ مِنۡهُمُ ٱلۡقِرَدَةَ وَٱلۡخَنَازِيرَ وَعَبَدَ ٱلطَّـٰغُوتَۚ أُوْلَـٰٓئِكَ شَرّٞ مَّكَانٗا وَأَضَلُّ عَن سَوَآءِ ٱلسَّبِيلِ
ఇలా అను: "ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీని కంటే హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరినైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో![1] మరియు వారు ఎవరైతే కల్పిత దైవాల (తాగూత్ ల) దాస్యం చేస్తారో.[2] అలాంటి వారు (పునరుత్థాన దినమున) ఎంతో హీనస్థితిలో ఉంటారు మరియు వారు ఋజుమార్గం నుండి చాలా దూరం వెళ్లి పోయిన వారే!"