Quran Quote  :  Noah son was also dawned into water as he refused to embark on the Ark. - 11:43

కురాన్ - 2:173 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّمَا حَرَّمَ عَلَيۡكُمُ ٱلۡمَيۡتَةَ وَٱلدَّمَ وَلَحۡمَ ٱلۡخِنزِيرِ وَمَآ أُهِلَّ بِهِۦ لِغَيۡرِ ٱللَّهِۖ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَلَآ إِثۡمَ عَلَيۡهِۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ

నిశ్చయంగా, ఆయన మీ కొరకు చచ్చిన జంతువు, రక్తం, పందిమాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయబడిన దానిని (తినటాన్ని) నిషేధించి ఉన్నాడు[1]. కాని ఎవరైనా గత్యంతరంలేక, దుర్నీతితో కాకుండా, హద్దు మీరకుండా (తిన్నట్లైతే) అట్టి వానిపై ఎలాంటి దోషం లేదు![2] నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు[3], అపార కరుణాప్రదాత.

సూరా సూరా బకరా ఆయత 173 తఫ్సీర్


[1] ఈ 'హరాం చేయబడిన విషయాలు ఇంకా మూడు చోట్లలో పేర్కొనబడ్డాయి. చూడండి, 5:3, 6:145, 16:115. [2] ఈ నాలుగు గాక 'హదీస్'లో 'హరామ్ గా పేర్కొనబడినవి ఇవి: 1) గోళ్ళతో వేటాడి చంపే మృగాలు, 2) తమ గోళ్ళతో వేటాడే పక్షులు, 3) గాడిద, కుక్క మొదలైనవి. ఇంకా వివరాలకు చూడండి 5:3. 'హదీస్'లో మరణించిన చేప 'హలాల్ గా పరిగణింపబడింది. అల్లాహుతా'ఆలా తప్ప, ఇతరులను సంతృప్తి పరచడానికి వారి పేరున ఒక పశువును జి'బ్'హ్ చేయటం - జి'బ్'హ్ చేసేటప్పుడు అల్లాహ్ (సు.తా.) పేరు తీసుకున్నా- వారి సంకల్పం (నియ్యత్) అల్లాహ్ (సు.తా.) కాక, ప్రత్యేకమైన వేరే ఇతరుణ్ణి సంతోషింపజేయటానికైతే, అలాంటి దానిని తినటం కూడా 'హరామ్. అంతేగాక అల్లాహ్ యేతరులకు అర్పించబడినది (నజ'ర్, నియా'జ్, చఢావా చేసింది) ఏదైనా తినటం కూడా 'హరామ్. ('స'హీ'హ్ అల్ - జామె, అస్స'గీర్ వ జ్యాదతహు, అల్ బానీ పుస్తకం - 2 పేజీ - 1024. [3] అల్ 'గఫూరు: Oft-Forgiving, Most Forgiving, క్షమాశీలుడు, పాపాలను ఎక్కువగా క్షమించేవాడు. అల్-'గప్ఫారు: క్షమించేవాడు, చూడండి 20:82. అల్-'గప్ఫారు మరియు అల్-'గఫూరు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. అల్-'గాఫిర్: క్షమాగుణ పరిపూర్ణుడు, చూడండి, 40:3.

Sign up for Newsletter