కురాన్ - 2:222 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡمَحِيضِۖ قُلۡ هُوَ أَذٗى فَٱعۡتَزِلُواْ ٱلنِّسَآءَ فِي ٱلۡمَحِيضِ وَلَا تَقۡرَبُوهُنَّ حَتَّىٰ يَطۡهُرۡنَۖ فَإِذَا تَطَهَّرۡنَ فَأۡتُوهُنَّ مِنۡ حَيۡثُ أَمَرَكُمُ ٱللَّهُۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلتَّوَّـٰبِينَ وَيُحِبُّ ٱلۡمُتَطَهِّرِينَ

మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: "అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి[1]. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులు అయిన తరువాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు." [2] నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాప పడేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుద్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు.

సూరా సూరా బకరా ఆయత 222 తఫ్సీర్


[1] స్త్రీల ఋతుకాలం: ప్రతి చంద్ర మాసంలో 4-5 రోజుల వరకు రక్తం ప్రసరించే కాలం. యూదులు మరియు ఇతర జాతుల వారు ఋతుకాలంలో స్త్రీలను వేరే గదులలో దూరంగా ఉంచేవారు. వారిని వంటింటిలోకి కూడా పోనిచ్చేవారు కాదు. కావున ఈ విషయం గురించి, 'స'హాబీలు ప్రవక్త ('స'అస) గారిని ప్రశ్నించగా, ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఇందులో స్త్రీలతో ఋతుకాలంలో సంభోగం మాత్రమే నిషేధించబడింది. వారు వంట చేయటం, ఒకే గదిలో భర్తతో కలిసి ఒకే మంచంపై పరుండటం నిషేధించబడలేదు. [2] అల్లాహ్ (సు.తా.) ఆదేశించిన చోటు నుండి అంటే సంతానం పుట్టే చోటు నుండి మాత్రమే. ఇతర ఏ చోట్ల నుండి కూడా కాదు. దీనితో విశదమయ్యేది ఏమిటంటే, భార్యతో కూడా మలమార్గం ద్వారా సంభోగం చేయటం నిషిద్ధం ('హరాం).

Sign up for Newsletter