కురాన్ - 2:270 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَآ أَنفَقۡتُم مِّن نَّفَقَةٍ أَوۡ نَذَرۡتُم مِّن نَّذۡرٖ فَإِنَّ ٱللَّهَ يَعۡلَمُهُۥۗ وَمَا لِلظَّـٰلِمِينَ مِنۡ أَنصَارٍ

మరియు మీరు (ఇతరులపై) ఏమి ఖర్చుచేసినా, లేక ఏ మొక్కుబడి చేసుకున్నా, నిశ్చయంగా అల్లాహ్ కు అంతా తెలుస్తుంది[1]. మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.

సూరా సూరా బకరా ఆయత 270 తఫ్సీర్


[1] ఏదైనా మంచి పనికి పూనుకొని అది పూర్తి అయితే నేను అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఇంత ఖర్చు చేస్తాను, లేక సత్కార్యం చేస్తాను, అని మొక్కుబడి చేసుకుంటే! దానిని పూర్తి చేయాలి. అల్లాహ్ (సు.తా.) పేరట చేసే మొక్కుబడి కూడా, నమా'జ్ మరియు ఉపవాసం మాదిరిగా అల్లాహ్ (సు.తా.) ఆరాధనయే. కాబట్టి అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల పేరట మొక్కుబడి చేయటం షిర్క్ అంటే అల్లాహ్ (సు.తా.) క్షమించని మహాపాపం.

Sign up for Newsletter